నా కెరీర్‌లో ది బెస్ట్ సినిమా ఇదే.. షాకింగ్ స్టేట్‌మెంట్ చేస్తూ అనుపమ ఆసక్తికర కామెంట్స్(వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-18 07:44:22  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో ఫుల్ బిజీ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది.

నా కెరీర్‌లో ది బెస్ట్ సినిమా ఇదే.. షాకింగ్ స్టేట్‌మెంట్ చేస్తూ అనుపమ  ఆసక్తికర కామెంట్స్(వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో ఫుల్ బిజీ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. త్వరలో అనుపమ లేడీ ఓరియెంటెడ్ ‘పరదా’ (parada) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula)దర్శకత్వం వహించిన ఈ మూవీ పూర్తిగా కల్పిత కథే అయినా 1980లో జరిగిన కొన్ని సంఘటన ఆధారాంగా రూపొందించారు. ఇందులో దర్శన రాజేంద్రన్(Darshana Rajendran), సంగీత కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు, పివిశ్రీధర్ మక్కువ, విజయ్ డొంకడ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘పరదా’ ఆగస్టు 22న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న అనుపమ షాకింగ్ స్టేట్‌మెంట్ చేసింది.

‘‘'పరదా' అనేది నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రత్యేకమైన సినిమా. నా కెరీర్‌లో ఇలాంటి పాత్రను నేను ఎప్పుడూ పోషించలేదు. నేను ఈ మూవీ ఈవెంట్‌లో ఫస్ట్ ఇదే మాట చెప్పాను ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. నా కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమా పరదానే. ఆగస్టు 22న మీరు కూడా ఇదే మాట చెబుతారని నాకు నమ్మకముంది. అందరూ చెప్పినట్లు మీరు సినిమా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పండి. ముందు రివ్యూస్ చూసాకే మా ‘పరదా’ చిత్రానికి వెళ్లండి. సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది. పదేళ్ల ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు రావణాసురుడు వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనుకుంటుంది అని వచ్చాను.

‘పరదా’ కోసం దర్శన ఎంతగానో హార్డ్ వర్క్ చేసిందంటే ఒక తెలుగు అమ్మాయిలాగే డైలాగ్స్ కరెక్ట్‌గా చెప్పింది. ఆమె ఇంకా చాలా సినిమాలు చేయబోతోంది. సంగీతగారిని మిస్ అవుతున్నాను. ఇందులో ఆమె క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అసలు రివ్యూస్‌లో ఫస్ట్ ఆవిడ పేరే రాస్తారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా వరకు నెగెటివ్ రివ్యూస్ చూసే జనాలు థియేటర్స్‌కు వెళ్లడం మానేశారు. ఈ క్రమంలో.. అనుపమ రివ్యూలు చూసాకే పరదాకు వెళ్లండి అని చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి.

link

Read More Cinema News

Read More Life Style news

Next Story