- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేం మీ ఇల్లు కాదు.. లోపలికి రావద్దంటూ ఫొటోగ్రాఫర్లపై అలియా భట్ ఫైర్ (వీడియో)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఈ భామ ఇటీవల ‘వార్-2’(War-2)లోనూ కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘అల్ఫా’ (Alpha)మూవీ చేస్తోంది. అంతేకాకుండా అడల్ట్ కంటెంట్‌తో ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌లోనూ నటించబోతున్నట్లు సమాచారం. కానీ ఈ సారి థియేటర్‌కు కాకుండా ఓటీటీని టార్గెట్ చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ఎటర్నల్ సన్‌షైన్ పిక్చర్స్‌పై నిర్మించనుంది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, అలియా భట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇందులో ఆమె పికిల్ బాల్ ఆడి ఇంటికి రాగా.. అలియాను ఫాలో అవుతూ ఫొటోగ్రాఫర్లు సైతం లోపలికి వెళ్లున్నారు. ఈ నేపథ్యంలోనే అలియా దయచేసి లోపలికి రాకండి ఇదేమి మీ ఇల్లు కాదు కదా.. బయటకు వెళ్లండి అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఆమెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ అయితే మాత్రం ఫొటోగ్రాఫర్లను అవమానించడమేంటని ట్రోల్ చేస్తున్నారు.






