- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ఓ అద్భుతమైన పవిత్ర దృశ్య కావ్యం.. ఫైరింగ్ పోస్టర్‌తో హైప్ పెంచిన నాగవంశీ
స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వాయుపుత్ర’(VAYUPUTRA).

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వాయుపుత్ర’(VAYUPUTRA). చరిత్ర, భక్తి భావంతో భారీ స్థాయిలో 3D యానిమేషన్ చిత్రంగా రూపొందిస్తున్నారు. హనుమంతుని కాలాతీత కథను గొప్ప దృశ్యకావ్యంగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఈ సినిమా గొప్ప యోధుడు కథతో రాబోతుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. హనుమంతుడి కథతో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 దసరా కానుకగా విడుదల కాబోతుంది. తాజాగా, నాగవంశీ (Naga Vamsi)ట్విట్టర్ ద్వారా ‘వాయుపుత్ర’కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలను పెంచారు.
ఇందులో హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తూ శక్తివంతమైన పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ప్రపంచం ఎన్నడూ చూడని విధంగా పునర్జన్మ పొందిన ఓ యోధుడి కథ రాబోతుంది. ఇతిహాస స్థాయి, ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఓ అద్భుతమైన పవిత్ర దృశ్య కావ్యం. మునుపెన్నడూ లేని విధంగా భక్తి పారవశ్యంలో ముంచేయడానికి ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది. వాయుపుత్ర ఒక సినిమాటిక్ మైలురాయిగా విశ్వాసం, శౌర్యం, విధితో మారనుంది. ‘వాయుపుత్ర భారతీయ సినిమాని పునర్నిర్వచించటానికి రెడీ అవుతోంది.మన అత్యంత గౌరవనీయమైన సాంస్కృతిక చిహ్నాలలో ఒకటైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనుంది’’ అని రాసుకొచ్చారు.






