- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్ ఎంట్రీపై స్పందించిన కళ్యాణి ప్రియదర్శన్.. తన కోరిక బయటపెడుతూ ఆసక్తికర కామెంట్స్
మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘లోక: చాప్టర్ 1 – చంద్ర’ సినిమాతో ఊహించని స్థాయిలో హిట్ అందుకుని పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘లోక: చాప్టర్ 1 – చంద్ర’ సినిమాతో ఊహించని స్థాయిలో హిట్ అందుకుని పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమెకు వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్‌బేస్ పెరిగింది. ఇప్పటికే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా సిద్ధమవుతుండగా, మరోసారి అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కళ్యాణి చేతిలో ‘జీనీ’, ‘మార్షల్’ (Marshall)లాంటి భారీ ప్రాజెక్టులు ఉండటంతో వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారింది. కెరీర్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్న కళ్యాణి, కథలు ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు ఇటీవలి కాలంలో జోరుగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)నటిస్తున్న ‘ప్రలే’ (praley)సినిమాతో కళ్యాణి హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణి ప్రియదర్శన్, బాలీవుడ్ ఎంట్రీపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.“బాలీవుడ్‌పై ఆసక్తి ఉంది. కానీ ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకూ ఒప్పుకోలేదు. ‘ప్రలే’తో లింక్ చేస్తున్న వార్తల్లో నిజం లేదు” అని ఆమె క్లియర్‌గా చెప్పింది. హిందీ సినిమాలు చేయడంలో ఎలాంటి తొందర లేదని, కేవలం పాన్ ఇండియా ట్యాగ్ కోసం సినిమాలు చేయాలన్న ఆలోచన తనకు లేదని తెలిపింది. అలాగే హిందీ ఇండస్ట్రీకి వెళ్లాలంటే భాష లేదా మార్కెట్ కంటే కథ, పాత్ర ముఖ్యమని చెప్పిన కళ్యాణి, “సరైన స్క్రిప్ట్, బలమైన క్యారెక్టర్ దొరికితే తప్పకుండా చేస్తాను. కానీ తొందరపడే ఆలోచన మాత్రం లేదు” అంటూ వెల్లడించింది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులపైనే పూర్తి ఫోకస్ పెట్టినట్లు పేర్కొంది.






