- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్మిక లవ్‌స్టోరీపై దీక్షిత్ రియాక్షన్ ఇదే.. మేమిద్దరం ఎప్పుడూ వాటి గురించే మాట్లాడుకుంటామంటూ కామెంట్స్
యంగ్ హీరో దీక్షిత్ శెట్టి(Dixit Shetty) ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. ‘దసరా’ మూవీలో సూరి పాత్రలో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: యంగ్ హీరో దీక్షిత్ శెట్టి(Dixit Shetty) ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. ‘దసరా’ మూవీలో సూరి పాత్రలో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అంతేకాకుండా తెలుగులో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రష్మిక మందన్న(Rashmika Mandanna), అను ఇమాన్యుయేల్(Anu Emmanuel) కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు అమ్మాయిలను కన్నీరు పెట్టుకునేలా చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దీక్షిత్ శెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ .
క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు అభిషేక్ ఎమ్ దర్శకత్వం వహిస్తున్నారు. బృందా ఆచార్య హీరోయిన్‌గా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 27న విడుదల కానుంది. ప్రమోషన్స్ ఫుల్ బిజీగా ఉన్న దీక్షిత్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనతో నటించిన రష్మిక లవ్‌స్టోరీ గురించి స్పందించారు. ‘‘సహనటీనటుల వ్యక్తిగత జీవితం గురించి నేను పట్టించుకోను. వాళ్ల పర్సనల్ విషయాల గురించి ఎక్కడా మాట్లాడకపోవడం ఒకరినొకరు గౌరవించుకునే విధానం. రష్మిక వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు.
ఆమె ప్రేమ, ఎంగేజ్‌మెంట్ గురించి నేనెప్పుడూ రష్మికతో చర్చించలేదు. ఎందుకంటే నాకు అలాంటి విషయాల్లో ఆసక్తి ఉండదు. మేం ఎప్పుడూ సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం’’ అని చెప్పారు. కాగా.. గత కొద్ది కాలంగా విజయ్ దేవరకొండ, రష్మికకు ఎంగేజ్‌మెంట్ అయినట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో రాజస్థాన్‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్. కానీ ఈ విషయంపై వీరిద్దరు ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. అసలు పెళ్లి తేదీ అయినా ప్రకటిస్తారా? లేక సీక్రెట్‌గా చేసుకుని షాకివ్వబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.






