- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది నాకెరీర్‌లో మరుపురాణి క్షణం.. కాన్స్ ఎంట్రీపై కళ్యాణి ప్రియదర్శన్ ఎమోషనల్ కామెంట్స్
సినిమా ప్రపంచంలో కాన్స్ ఫెస్టివల్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వేదికపై అడుగుపెట్టడం నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తన కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకోబోతున్నారు. మే 14న ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికపై ఆమె మొదటిసారి సందడి చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఆమె చిత్రం ‘లోకా - చాప్టర్ 1 - చంద్ర’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, ఈ అంతర్జాతీయ ఆహ్వానం అందడం పట్ల ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "సినిమా ప్రపంచంలో కాన్స్ ఫెస్టివల్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వేదికపై అడుగుపెట్టడం నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. ముఖ్యంగా ‘లోకా’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే, నా కాన్స్ అరంగేట్రం నాకు మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది" అని కళ్యాణి తన ఎగ్జైట్‌మెంట్‌ను పంచుకున్నారు.
ప్రస్తుత కాలంలో భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న తీరుపై కళ్యాణి హర్షం వ్యక్తం చేశారు. "మన కథలు, మన గొంతుకలు ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ గొప్ప మార్పులో నేను కూడా ఒక భాగం కావడం, నా కెరీర్ ఈ దశలో ఉండగా కాన్స్ వంటి వేదికను అనుభవించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు. ఈ వేడుకను ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎంతో హాయిగా ఆస్వాదించాలని తాను అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. రెడ్ కార్పెట్ మీద కళ్యాణి ఎలా కనిపిస్తారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. "నా అవుట్‌ఫిట్ గురించి నేను కూడా చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. కొన్ని విషయాలు ఇంకా ప్లాన్ చేస్తున్నాం, కానీ కచ్చితంగా అందరినీ ఆకట్టుకునేలా నా లుక్ ఉంటుంది. ఇది నా కెరీర్‌లోనే మరుపురాణి క్షణం" అని చెప్పారు. ‘లోకా – చాప్టర్ 1 – చంద్ర’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన కళ్యాణి, ఇప్పుడు కాన్స్ వేదికపై తన మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతున్నారు.






