అజిత్ రియల్ క్యారెక్టర్ ఇదే.. ప్రతి క్షణం ఒక పాఠంలా అనిపించిందంటూ మంజు వారియర్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

అజిత్ సార్‌తో కలిసి చేసిన ఆ జర్నీ నాకు కనువిప్పు కలిగించింది. మేము అక్కడ 14 రోజుల పాటు బైక్‌పై ప్రయాణించాం.

అజిత్ రియల్ క్యారెక్టర్ ఇదే.. ప్రతి క్షణం ఒక పాఠంలా అనిపించిందంటూ మంజు వారియర్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: మలయాళ లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో కలిసి చేసిన లద్దాఖ్ బైక్ ట్రిప్ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సుమారు 14 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందని, ఈ యాత్ర వల్ల తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లద్దాఖ్ ప్రయాణం గురించి మంజు వారియర్ మాట్లాడుతూ.. "అజిత్ సార్‌తో కలిసి చేసిన ఆ జర్నీ నాకు కనువిప్పు కలిగించింది. మేము అక్కడ 14 రోజుల పాటు బైక్‌పై ప్రయాణించాం. ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఒక పాఠంలా అనిపించింది. ముఖ్యంగా ప్రయాణంలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, సురక్షితంగా ఎలా ఉండాలి అనే విషయాలను అజిత్ సార్ నాకు వివరించారు.

భద్రతకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత చూసి నేను చాలా నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చారు. మంజు వారియర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించారు. "నాకు బైక్ నడపడం వచ్చు కానీ, అప్పటివరకు నా దగ్గర లైసెన్స్ లేదు. అజిత్ సార్ టీమ్ అంతా ప్రొఫెషనల్ రైడర్స్. వారితో కలిసి అంత దూరం ప్రయాణించడం నాకు ఒక విభిన్నమైన అనుభవాన్ని ఇచ్చింది. ఆ ట్రిప్ పూర్తి కాగానే, నేను వెంటనే బైక్ లైసెన్స్ తీసుకున్నాను. అజిత్ సార్ స్ఫూర్తితోనే నేను ఇప్పుడు అఫీషియల్‌గా రైడర్‌ను అయ్యాను" అని ఆమె గర్వంగా చెప్పారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ అజిత్ కుమార్ ఎంత సింపుల్‌గా ఉంటారో, తోటి నటీనటులకు ఎలా స్ఫూర్తినిస్తారో మంజు వారియర్ మాటలు మరోసారి నిరూపించాయి.

Next Story