ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన చాప్టర్.. నేను మాస్ క్యారెక్టర్ చేశా: సప్తమి గౌడ

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-17 14:14:49  IST  )

టాలెంటెడ్ హీరో డాలీ ధనంజయ(Dolly Dhananjaya), సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హలగలి’.

ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన చాప్టర్.. నేను మాస్ క్యారెక్టర్ చేశా: సప్తమి గౌడ
X

దిశ, సినిమా: టాలెంటెడ్ హీరో డాలీ ధనంజయ(Dolly Dhananjaya), సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హలగలి’. సుకేష్ నాయక్(Sukesh Nayak) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి ధూళిపల్ల నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో చిత్రీకరిస్తున్నారు. తాజాగా, చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న డాలీ ధనంజయ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు. హలగలి అన్ టోల్డ్ స్టోరీ. ఈ సినిమాలో పార్ట్ కావడం గర్వంగా భావిస్తున్నాను. ‘హలగలి’ కర్ణాటకలో గ్రేట్ ఎమోషన్. నిర్మాత కళ్యాణ్, డైరెక్టర్ సుకేష్ చాలా ప్యాషన్ తో ఈ ప్రాజెక్టుని రూపొందిస్తున్నారు. కథ వినగానే ఈ ప్రాజెక్టులో పార్ట్ అవ్వాలి అనిపించింది. ఈ గ్లింప్స్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. మరిన్ని క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయి. తప్పకుండా సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. అందరి అంచనాలను అందుకుంటుంది. మీ అందరి సపోర్ట్ కి థాంక్స్. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది.

హీరోయిన్ సప్తమి గౌడ(Sapthami Gowda) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన చాప్టర్. త్వరలోనే నా క్యారెక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ కాబోతోంది. చాలా మాస్ క్యారెక్టర్ చేశాను. ఇది మన నేల కథ. డైరెక్టర్ చాలా అద్భుతంగా రాశారు. చాలా బిగ్ స్కేల్ లో ఈ సినిమా తీస్తున్నారు. ఈ మూవీ సెట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ధనుంజయ గారితో ఇది నా సెకండ్ ఫిల్మ్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది’’ అని చెప్పుకొచ్చింది.

Next Story