ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.. టాలీవుడ్ హీరోకు సపోర్ట్‌గా కీలక వీడియో రిలీజ్ చేసిన మెగాస్టార్

by Mallepaka Hamsa |

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’(Kishkindhapuri).

ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.. టాలీవుడ్ హీరోకు సపోర్ట్‌గా కీలక వీడియో రిలీజ్ చేసిన మెగాస్టార్
X

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’(Kishkindhapuri). కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కీలక వీడియోను రిలీజ్ చేశారు ‘‘మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు’ నిర్మిస్తున్న నిర్మాత సాహు గారపాటి నిర్మాణంలో వచ్చిన మరో చిత్రం ‘కిష్కింధపురి’ ఇటీవలే రిలీజై మంచి విజయం సాధించింది. అందుకు గాను ఆ మూవీలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు, నిర్మాతలకు నా అభినందనలు. సాధారణంగా హార్రర్ సినిమాలు అంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ ఓ దెయ్యం కథగా చెప్పడం జరుగుతుంది.

కానీ ఈ మూవీలో హార్రర్‌తో పాటు ఒక మంచి సైకలాజికల్ పాయింట్‌ని కూడా యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. అంటే శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరం అని చెప్పడం బాగుంది. అలాగే మనిషికున్న బాధలు, కష్టాలు పక్కన వాళ్లకు చెప్పుకోకుండా ఒంటరితనం అనుభవిస్తుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి చక్కగా చూపించారు. ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఓ మంచి హిట్‌ని తన అకౌంట్లో వేసుకున్నారు. ‘కిష్కింధపురి’తో అద్బుతమైన విజయాన్ని అందుకున్న ప్రొడ్యూసర్ సాహు గారపాటికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా’’ అని చెప్పుకొచ్చారు.

link

Next Story