- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటన నేర్చుకునే వారికి ఇదొక పాఠం.. సమంత ఆసక్తికర నోట్ విడుదల
బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్(Yami Gautam), ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi)జంటగా నటించిన సినిమా ‘హక్’(Haq).

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్(Yami Gautam), ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi)జంటగా నటించిన సినిమా ‘హక్’(Haq). కోర్ట్‌రూమ్ డ్రామా చిత్రం, ఇది షా బానో కేసు వంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ట్రిపుల్ తలాక్ తర్వాత న్యాయం కోసం పోరాడే మహిళ కథను ఇందులో చూపించారు. అయితే విడుదలకు పలు వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా గత ఏడాది విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ సినీ సెలబ్రిటీల మనసులు గెలుచుకుంటోంది. ఇటీవల ఆలియా భట్ సినిమాపై ప్రశంసలు కురిపించింది.
తాజాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘హక్’ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి గురైనట్లు తెలుపుతూ.. ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ‘‘హక్ సినిమా అయిపోయిన వెంటనే ఈ మాటలు రాయాలనిపించింది. ఎందుకంటే ఆ సినిమా నాలో కలిగించిన భావోద్వేగాలను కొంచెం కూడా కోల్పోకూడదని అనుకున్నాను. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ కథ ఎంతో సహజంగా, లోతైన మానవీయ కోణంలో సాగింది. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎక్కడా ఎవరినీ తక్కువ చేసి చూపించలేదు. ముఖ్యంగా యమీ గౌతమ్ లాంటి అద్భుతమైన నటి ఈ కథకు ప్రాణం పోశారు. యామీ.. నీ నటన నన్ను మాటల్లో చెప్పలేనంతగా కదిలించింది.
ఒకేసారి ప్రేమ, ఆగ్రహం, బలం, నిస్సహాయత, ఆశ.. ఇలా అన్ని భావాలను నేను అనుభవించాను. సినిమా అంటే ఇది. ఎన్నో ఆటుపోటుల మధ్య మనం ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నామో, ఎందుకు కష్టపడతామో చెప్పడానికి ఇలాంటి సినిమాలే నిదర్శనం. చాలా ఏళ్ల తర్వాత ఒక నటన నన్ను ఇంతలా కదిలించింది. యమీ గౌతమ్ నటనను వర్ణించడానికి పదాలు సరిపోవు. ఆమె మౌనం, చూపులు, క్లైమాక్స్ మోనోలాగ్.. నటన నేర్చుకునే వారికి ఇదొక పాఠం. ఆమెకు సెల్యూట్ చేస్తున్నాను’’ అని రాసుకొచ్చింది.






