- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు ఇదొక ప్రత్యేకమైన సవాలుగా మారింది.. కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన రెజీనా
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా (Regina)వెరైటీ రోల్స్ చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా (Regina)వెరైటీ రోల్స్ చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సైకలాజికల్ థ్రిల్లర్స్, హారర్, కామెడీ నేపథ్యంలో పలు మూవీస్ చేసి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘ది వైవ్స్’ (The Wives)సినిమాతో రాబోతుంది. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్, సౌరభ్ సచ్‌దేవా, సోనాలి కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈనేపథ్యంలో.. తాజాగా, రెజినా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘ది వేవ్స్’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ చిత్రంలో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. మేము మొదటి ఫెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. దర్శకుడు ఈ కథను ఎన్నో అద్బుతమైన పాత్రలతో తీర్చిదిద్దుతున్నారు. దీంతో పాటు నేను చెన్నైలో ‘మూకుతి అమ్మాన్-2’ షూటింగ్ కూడా కొనసాగిస్తున్నాను. రెండు నగరాల సినీ పరిశ్రమల మధ్య ప్రయాణిస్తూ నటించడం నాకు చాలా ప్రత్యేకమైన సవాలుగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఇది నన్ను స్ఫూర్తిగా, శక్తిమంతంగా చేస్తోంది’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.






