- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటనకు పనికిరావు అన్నారు : దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
by Chukka Sudharani |
‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.

X
దిశ, సినిమా : 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఇటీవలే 'సీతారామం' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హీరో.. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో మెప్పించాడు. ఇక ప్రస్తుతం తను ఆర్. బాల్కీ దర్శకత్వంలో 'చుప్.. రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్' సినిమాలో నటిస్తుండగా.. సెప్టెంబర్ 23న విడుదల కానుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే క్రమంలో తనపై వచ్చిన నెగెటివ్ రివ్యూస్ గురించి స్పందించాడు. 'కెరియర్ ప్రారంభంలో నా సినిమాల గురించి వచ్చిన కామెంట్స్ చదువుతుంటే బాధగా అనిపించేది. నాకు నటన చేతగాదని, సినిమాలు చేయడం ఆపితే బెటర్ అని, నన్ను ఇండస్ట్రీ కోరుకోవడం లేదని విమర్శించేవారు. ఇలాంటి రివ్యూస్ నన్ను కలిచివేశాయి' అని చెప్పుకొచ్చాడు దుల్కర్.
Next Story






