‘వార్-2’లో అన్ని అలాంటి సీన్లే పెట్టారు .. వారికి ఆ లాజిక్ కూడా తెలియదా అంటూ ఆర్జీవీ ఫైర్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వార్-2’(war-2).

‘వార్-2’లో అన్ని అలాంటి  సీన్లే పెట్టారు .. వారికి ఆ లాజిక్ కూడా తెలియదా అంటూ ఆర్జీవీ ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వార్-2’(war-2). అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) దర్శకత్వం వహించగా.. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న థియేటర్స్‌లోకి వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ ‘వార్-2’ ఫ్లాప్ అవడంపై స్పందించాడు. ‘‘హృతిక్ ఎంట్రీ సీన్‌లో అసు ఎందుకు ఫైట్ చేశాడో నాకు అర్థం కాలేదు. ఓ వ్యక్తిని అడిగే జపాన్ వాళ్లతో ఫైట్ చేయడం కొత్తగా ఉంటుందనే కాన్సెప్టుతో పెట్టారని చెప్పాడు. అసలు స్పై యూనివర్స్ సినిమాలు మన ఇండియాకు శత్రుదేశాలతో పోరాడే విధంగా ఉండాలి.

కానీ మన ఇండియాకు జపాన్ ఎప్పుడు శత్రుదేశం అయింది. ఈ లాజిక్ సినిమా తీసిన వాళ్లకు తెలియదా. మన శత్రుదేశాలతో పోరాడటమే ‘వార్-2’ ఉద్దేశం. కానీ ఈ మూవీలో అసలు సంబంధమే లేకపోయినా జపాన్ వాళ్లతో ఫైట్స్ పెట్టారు. అది ప్రేక్షకులకు నచ్చలేదు కాబట్టి ‘వార్-2’పై ఈ సీన్ల ఎఫెక్ట్ పడింది. సంబంధం లేనివి ఇందులో ఎన్నో ఉన్నాయి. అందుకే అది ఆడలేదు. కొత్తగా ఉండాలని ఇలాంటివన్నీ చేసి కథను చంపేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Next Story