- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాలా రోజులుగా పట్టించుకోవడం లేదు.. ఏదో ఒకరోజు ఆ సరిహద్దులు పూర్తిగా చెరిగిపోవాలని కోరుకుంటున్నా: ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి (Priyamani)క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలో నటిస్తోంది.

దిశ, సినిమా: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి (Priyamani)క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలో నటిస్తోంది. చివరగా తెలుగులో ‘కస్టడీ’ సినిమాతో హిట్ అందుకున్న ఆమె ప్రస్తుతం హిందీ,తమిళ, భాషల్లో నటిస్తోంది. త్వరలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’(The Family Man-3) వెబ్ సిరీస్‌తో రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దక్షిణాది సినిమాల గురించి గొప్పగా చెప్పింది. తెలుగు సినిమాలకు గుర్తింపు రావడం తనకు గర్వకారణం అని తెలిపింది.. ‘‘జనాలు ఇప్పటికైనా దక్షిణాది సినిమాలను చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రాంతీయ భాషా చిత్రాలను ఎంతో బాగా ఆదరిస్తున్నారు. ఎప్పటినుంచో మంచి సినిమాలున్నాయి.
కానీ గతంలో వాటికంత ప్రాధాన్యత దక్కకుండా పోయింది. ప్రతి భాషలోనూ అద్భుతమైన సినిమాలు వస్తూనే ఉన్నప్పటికీ ప్రేక్షకులు చూడటం లేదు. వాటి గురించి మాట్లాడేవారు కూడా కాదు. కానీ ఇప్పుడు అలాంటి చిత్రాలే భారీ విజయాలు అందుకోవడం నిజంగా గొప్ప విషయం. సినిమాలతో పాటు దానికోసం కష్టపడిని దర్శకనిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్ల గురించి కూడా చర్చించుకోవడం సంతోషంగా అనిపిస్తుంది. ఈ మార్పు ఇండస్ట్రీకి చాలా మంచిది. ప్రాంతీయ సినిమాకు, హిందీ చిత్రానికి మధ్య ఉన్న అడ్డుగోడలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఏదో ఒకరోజు సరిహద్దులు చెరిగిపోలని నేను కోరుకుంటున్నా’’ అని చెప్పింది. ఇండస్ట్రీలో గతంతో పోలిస్తే.. చాలా మార్పులు వచ్చినట్లు తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.






