అందంగా కనిపించడానికి పక్కటెముకలు విరగొట్టుకుంటున్నారు.. ఊర్వశీపై రాఖీ సావంత్ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటి రాఖీ సావంత్(Rakhi Sawant) నిత్యం పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది.

అందంగా కనిపించడానికి పక్కటెముకలు విరగొట్టుకుంటున్నారు.. ఊర్వశీపై రాఖీ సావంత్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి రాఖీ సావంత్(Rakhi Sawant) నిత్యం పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే తన పర్సనల్ లైఫ్‌లోనూ రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా, రాఖీసావంత్ హీరోయిన్ ఊర్వశి అందంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela)మౌంటేన్ గర్ల్‌ను నేచురల్ బ్యూటీని అని చెప్పడంపై మండిపడింది. ‘‘ఊర్వశీ మేము నీ పాత ఫొటోలను చూశాం. ఈ రోజుల్లో చాలా మంది సన్నగా కనిపించడానికి తమ పక్కటెముకలు విరగొట్టుకుంటున్నారు. ఇది కొత్త ట్రెండ్‌గా మారింది. కొన్ని దేశాల్లో ఇలా సర్జరీలు చేయించుకుంటున్నారు.

నడుము సన్నగా కనిపించాలంటే రిబ్స్ తొలగించుకుంటున్నారు. అందులో తప్పేమి లేదు కానీ నువ్వు సహజంగా ఇలా ఉన్నాను అని అబద్ధం చెప్పకు. మేము నిన్ను మొదట చూసినప్పుడు నువ్వు ఇంతలా లేవు. ఇప్పుడు ఎంత మారిపోయావో అందరికీ తెలుసు. దయచేసి నేచురల్ బ్యూటీని అని చెప్తూ అతి చేయకు. లుక్ మార్చుకుంటే తప్పులేదు.. కానీ సహస సౌందర్యం అనడం తప్పు’’ అని కౌంటర్లు వేసింది. కాగా.. గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రాఖీ సావంత్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలోనే పలు నటీనటులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Next Story