బిగ్ బాస్-7 నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న స్టార్స్ వీళ్లే..

by Disha Web Desk 9 |
బిగ్ బాస్-7 నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న స్టార్స్ వీళ్లే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంతోమంది బిగ్‌బాస్ హౌస్‌లో అవకాశం వస్తే బాగుండని ఎదురుచూస్తారు. అలాంటిది కొంతమంది స్టార్స్ బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ‘‘సీరియల్ నటి అంజలి పవన్ రెమ్యునరేషన్ విషయంలో అడ్జస్ట్ కాకపోవడం వల్ల చివరి నిమిషంలో హౌస్‌లోకి రాలేకపోయిందట. జబర్దస్త్ ‘కమెడియన్ నరేష్’ ఈటీవీ వారితో ఉన్న కాంట్రాక్ట్ కారణంగా, మరోవైపు అమెరికా నుంచి ఒక షో కూడా ఉండడంతో బిగ్‌బాస్‌కు హ్యాండ్ ఇచ్చారని సమాచారం.

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన అనిల్‌ను చివరి నిమిషంలో యాజమాన్యం తనకు అవకాశం లేదని ఊహించని షాక్ ఇచ్చారట. అలాగే సీరియల్ నటి పూజ మూర్తి, మొగలిరేకులు ఫేమ్ సాగర్, మహేష్ ఆచంట’’ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయినందట. హౌస్‌లోకి వెళ్లాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరు ఎంతలా బాధపడుతున్నారో అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Read More: సొమ్ము కోసం బిగ్‌బాస్‌పై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారేమో: సీపీఐ నారాయణపై మండిపడ్డ కరాటే కళ్యాణి..

Bigg Boss Telugu 7 విన్నర్ ఎవరో మొదటి రోజే తెలిసిపోయింది.. హింట్ ఇచ్చేసిన నాగార్జున

Next Story

Most Viewed