ఇవి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. ‘హైవాన్’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన సమామి ఖేర్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)వరుస హిట్లతో దుమ్మురేపుతున్నారు.

ఇవి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. ‘హైవాన్’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన సమామి ఖేర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)వరుస హిట్లతో దుమ్మురేపుతున్నారు. బాక్సాఫీసు వద్ద సత్తాచాటుతూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రాల్లో ‘హైవాన్’ (Haiwan)ఒకటి. ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తుండగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్, దిస్పైన్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై వెంకట్ నారాయణ, శైలజ దేశాయ్ నిర్మిస్తున్నారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) హీరోగా చేస్తుండగా.. అక్షయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మలయాళ ‘ఒప్పం’కు రీమేక్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సయామీ ఖేర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హార్రర్, కామెడీ కమ్ ఫాంటసీ అంశాలతో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈనేపథ్యంలో.. తాజాగా, సయామీ ఖేర్(Saiyami Kher) ట్విట్టర్ ద్వారా షూటింగ్ అప్డేట్ ఇచ్చింది. ‘‘హైవాన్ ఊటీ షెడ్యూల్‌ను ముగించాను. సైఫ్ సర్ నుంచి చమత్కారం, దాతృత్వం నేర్చుకున్నాను. ఈ షెడ్యూల్ నాకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది. ప్రియదర్శన్ సర్, మా అద్భుతమైన నిర్మాతలతో ఎంతో కష్టపడ్డారు. మంచి ప్రయాణాలు ఎల్లప్పుడూ మీరు కొనసాగించే సంస్థతో ముడిపడి ఉంటాయి. ఇది ఎంత గొప్ప ప్రయాణమో నేను మాటల్లో చెప్పలేను’’ అని రాసుకొచ్చింది. అలాగే సెట్‌లో తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో అక్షయ్ కుమార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

link

Next Story