- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడంలో తప్పులేదు.. నిత్యామీనన్ బోల్డ్ స్టేట్‌మెంట్
పిల్లలు కావాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనడంలో తప్పులేదు.

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామీనన్. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఈ ‘అలా మొదలైంది’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఏకంగా జాతీయ అవార్డునే దక్కించుకుంది. రీసెంట్‌గా ‘తిరుచిత్రంబలం’ సినిమాకు గాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న నిత్యా, ప్రస్తుతం అడపా దడపా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, 37 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉంటున్న ఈ నటి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వివాహం, వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి గురించి నిత్యామీనన్ చాలా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. "పిల్లలు కావాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనడంలో తప్పులేదు" అని ఆమె అభిప్రాయపడింది. ఇది పూర్తిగా ఒక వ్యక్తిగత నిర్ణయమని, దీనిని ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదని ఆమె తేల్చి చెప్పింది.
ప్రస్తుతం తన బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంతో ఇష్టంగా గడుపుతున్న నిత్యా, తనను ఎవరూ నియంత్రించలేరని స్పష్టం చేసింది. "నాకు నా స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప, అదే జీవితం కాదు. నిజమైన ప్రేమ దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ ఒకవేళ పెళ్లి జరగకపోయినా నా జీవితం ఆగిపోదు" అని తన మనసులో మాట బయటపెట్టింది. ఒకప్పుడు తన అమ్మమ్మ పెళ్లి కోసం ఒత్తిడి చేసేదని, కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ల నుంచి కూడా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నిత్యామీనన్, తన వ్యక్తిగత విషయాల్లో ఎవరి మాటా విననని చెప్పకనే చెప్పింది. పెళ్లి చేసుకోనంత మాత్రాన జీవితం అసంపూర్ణం కాదని, తనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఆమె వివరించింది. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే నిత్యామీనన్ ఎంత స్వతంత్రంగా ఆలోచిస్తుందో అర్థమవుతోంది. సోషల్ మీడియాలో కొందరు ఆమె మాటలకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం పెళ్లి వ్యవస్థపై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.






