వెనక్కి తిరిగి చూసే అవకాశమే లేదు.. ఆ పండుగకు ‘డెకాయిట్’ రాబోతుందంటూ అడివి శేష్ పోస్ట్

by Mallepaka Hamsa |

వెర్సటైల్ హీరో అడివి శేష్(Adivi Sesh ), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’(DACOIT ).

వెనక్కి తిరిగి చూసే అవకాశమే లేదు.. ఆ పండుగకు ‘డెకాయిట్’ రాబోతుందంటూ అడివి శేష్ పోస్ట్
X

దిశ, సినిమా: వెర్సటైల్ హీరో అడివి శేష్(Adivi Sesh ), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’(DACOIT ). షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ‘ఒక ప్రేమ కథ’ ట్యాగ్ లైన్‌తో రాబోతుంది. రివేంజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం క్రిస్మస్ పండుగకు విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈక్రమంలో.. తాజాగా, మరో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తూ అడివి శేష్ ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు. ‘‘ఈ సారి మామూలుగా ఉండదు.. మళ్లీ వెనక్కి తిరిగి చూసే అవకాశమే లేదు. ఉగాది సందర్భంగా ‘డెకాయిట్’ రాబోతుంది. వరల్డ్ వైడ్‌గా మార్చి 19న ఈ సినిమా విడుదల చేయబోతున్నాం’’ అనే క్యాప్షన్ జత చేశాడు. అలాగే కారులో మృణాల్ షాకింగ్ లుక్‌లో ఉండగా.. ఎవరికో గన్ గురిపెట్టి కోపంగా చూస్తున్నట్లు అడివి శేష్ కనిపించాడు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డడ నిర్మిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

link

Next Story