ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. దయచేసి వాటిని నమ్మొద్దంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

by Mallepaka Hamsa |

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Verma) గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.

ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. దయచేసి వాటిని నమ్మొద్దంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Verma) గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన సినిమాలు చేస్తానని చెప్పి కొంతమంది నిర్మాతల దగ్గర డబ్బులు వసూల్ చేసినట్లు పలు పుకార్లు జోరందుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి(Niranjan Reddy), ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వచ్చిన ‘హనుమాన్’ సంచలనం సృష్టించింది. ఈక్రమంలోనే.. ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి మధ్య వివాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించడం లేదని టాక్. దానికి కారణం వీరి వివాదాలే అని తెలుస్తోంది ఇక వీరిద్దరూ ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రశాంత్ వర్మ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

‘‘కొన్ని మీడియా చానల్స్ సోషల్ మీడియా పేజీలు ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఫిర్యాతు వివరాలను అలాగే నా సమాధానం లేదా కొన్ని భాగాలను మాత్రమే ప్రచురించడం నా దృష్టికి వచ్చింది. ఈ పక్షపాత, బాధ్యతారహిత, ఏకపక్ష సమాచారం ప్రసారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ముందు విచారణలో ఉంది. ఈ దశలో అంతర్గత పత్రాలు ఇమేయిల్స్, ఒప్పందాలు లేదా ఆర్థిక వివరాలను బహిర్గతం చేయడం అనేది విచారణలో జోక్యం చేసుకోవడం వంటి చర్య అవుతుంది.

ఇది ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలను ఉద్దేశంతో జరుగుతోంది. నా మీద చేసిన అన్ని ఆరోపణలు అసత్యం, నిరాధారం ప్రతీకారపూరితమైనవే అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అన్ని మీడియా సంస్థలు ఈ అంశంపై ఊహాగానాల ఆధారంగా ప్రచారం చేయడం మానుకోవాలి. అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ విచారణ ఫలితం వచ్చే వరకు వేచి చూడాలని కోరుతున్నాను’’ అని ఓ నోట్ విడుదల చేశారు. దీంతో ఇది చూసిన వారంతా బిగ్ ట్విస్ట్ ఇచ్చాడుగా.. అంటూ మామూలోడు కాదని అంటున్నారు. వివాదం ఉందనే చెప్తూనే.. తన తప్పు లేదని స్పష్టం చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

link

Next Story