నేను హీరోనే కాదు అలాంటి పేరు కూడా నాకొద్దు.. వైష్ణవ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!

by Disha Web Desk 6 |
నేను హీరోనే కాదు అలాంటి పేరు కూడా నాకొద్దు.. వైష్ణవ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో చిరంజీవి అల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొట్టమొదటి చిత్రంతోనే హిట్ అందుకుని తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అదే ఫామ్‌లో రంగరంగ వైభవంగా, కొండ పొలం, వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తాజాగా, ప్రమోషన్స్‌లో భాగంగా వైష్ణవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ ఆదికేశవ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. అసలు ఎవరైనా నన్ను హీరో అంటే.. నేను హీరోని కాదు నటుడిని చెబుతాను. నిజానికి పవన్ కల్యాణ్ మావయ్య కూడా నాతో నటుడు అనిపించుకుంటేనే విభిన్న పాత్రలు చేసే అవకాశం ఉంటుందన్నాడు. యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి.. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించాము. ఫైట్స్ ఎక్కడా అతిగా అనిపించవు.. కొడితే పది మంది గాలిలో ఎగరడం లాంటివి ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి. నేను మంచి డాన్సర్‌ను కాకపోయినా చాలా కష్టపడి ఈ సినిమాలో డాన్సులు చేశాను. డాన్స్ మాస్టర్, శ్రీలీల మద్దతుతో పూర్తి న్యాయం చేయగలిగాను. దర్శకుడు శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు ఎంత బాగుందో.. దాన్ని అంతే అద్భుతంగా ఆయన తెరకెక్కించారు. నాకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్‌గా ఉంటాయి’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed