‘మంగళవారం’ సినిమాలో చాలా బోల్డ్ విషయం ఉంది. అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 6 |
‘మంగళవారం’ సినిమాలో చాలా బోల్డ్ విషయం ఉంది. అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి కాంబోలో వస్తున్న చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమా నవంబర్ 17న థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో ఈ మూవీ యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నాడు నిర్వహించారు. దీనికి గెస్ట్‌గా అల్లు అర్జున్ వచ్చాడు. ఇందులో భాగంగా బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ పాయల్ నటించి ఆర్ ఎక్స్ 100 ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఈ మంగళవారం కూడా అలాంటి మైల్ స్టోన్ అవుతుంది. అజయ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఇందులో చాలా బోల్డ్ విషయం ఉంది.

అలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించే మూవీలు చాలా తక్కువ ఉంటాయి. నాకు ఈ చిత్రం టీజర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. నాకు అజయ్ డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ ఎక్స్ 100 అంటే చాలా ఇష్టం. ఆయన గొప్ప టెక్నీషియన్. నేను ఈ టీజర్‌ను సుకుమార్ గారికి చూపించాను. ఆయన చూడి షాక్ అయ్యారు. చాలా బాగా డైరెక్ట్ చేశాడని అన్నారు. లైఫ్‌కి మనకి చాలా తక్కువ మంది ఫ్రెండ్ మాత్రమే మన సక్సెస్‌ని వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు స్వాతి, ప్రణవ్‌లు అలాంటి వాళ్లే. ఇది వాళ్ల ఫస్ట్ సినిమా. వాళ్లు ఇంకా మంచివి చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ల కోసం వచ్చి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed