ఆ చెత్త వార్తల వెనుక పెద్ద కుట్రే ఉందంటూ అదితి రావు హైదరీ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

నా గురించి కూడా కొన్నిసార్లు చెత్త వార్తలు వస్తుంటాయి. కానీ వాటి వెనుక ఏదో ఒక ఉద్దేశం ఉంటుందని నాకు తెలుసు.

ఆ చెత్త వార్తల వెనుక పెద్ద కుట్రే ఉందంటూ అదితి రావు హైదరీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లుగా కొనసాగుతున్న నటి అదితి రావు హైదరీ(Aditi Rao Hydari), ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద జరుగుతున్న దాడిపై వినూత్నంగా స్పందించారు. కేవలం నటన మీద మాత్రమే దృష్టి పెట్టే అదితి, ఈసారి పరిశ్రమలోని టాక్సిక్ కల్చర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి వచ్చే వార్తల్లో చాలా వరకు డబ్బులు ఇచ్చి చేయించే దుష్ప్రచారం చేయాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో కావాలని ఒక ఎజెండాతో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని, అవి చూసినప్పుడు తనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందని ఆమె చెప్పారు. ‘‘నా గురించి కూడా కొన్నిసార్లు చెత్త వార్తలు వస్తుంటాయి. కానీ వాటి వెనుక ఏదో ఒక ఉద్దేశం ఉంటుందని నాకు తెలుసు, అందుకే వాటిని లైట్ తీసుకుంటాను. నన్ను తొక్కేయాలని చూసినా పట్టించుకోలేదు’’ అని ఆమె పేర్కొన్నారు. ఒకప్పుడు హీరో హీరోయిన్లు అంటే ప్రేక్షకులకు ఒక రకమైన ఆసక్తి, రహస్యం ఉండేవి.

కానీ ఇప్పుడు డిజిటల్ విప్లవం వల్ల నటుల గురించి ప్రతి చిన్న విషయం బయట ఉండటంతో వారి చుట్టూ ఉండే ఆ మిస్టరీ మాయమైపోయిందని అదితి అభిప్రాయపడ్డారు. అతిగా సమాచారం అందుబాటులో ఉండటం కూడా ఒక భారం లాంటిదేనని ఆమె అన్నారు. విమర్శలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఎలా ఉండాలో అదితి తన తల్లి దగ్గర నేర్చుకున్నట్లు తెలిపింది ‘‘ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే, ఆ సమస్య వారి వ్యక్తిత్వంలోనే ఉంది అని నా తల్లి ఎప్పుడూ చెబుతుంటారు. ఆ ఆలోచనే నన్ను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుంది’’ అని అదితి తన మనసులోని మాటను పంచుకున్నారు. అలాగే ఇండస్ట్రీలో వరుసగా హిట్లు అందుకున్నా, నిలదొక్కుకోవడం అంత సులభం కాదని అదితి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గాడ్ ఫాదర్లు లేని అవుట్‌సైడర్లకి కమర్షియల్ సక్సెస్ వచ్చినా, మళ్లీ మంచి కథ కోసం వేచి చూడాల్సిందే అని పేర్కొన్నారు. ఒక హిట్ రాగానే అవకాశాలు క్యూ కడతాయని అనుకోవడం పొరపాటని, సక్సెస్ వచ్చినా రాకపోయినా టాలెంట్ ఉంటేనే నిలబడతామని ఆమె స్పష్టం చేశారు.

Next Story