ఈ సినిమాలో మూడు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.. అంచనాలను పెంచుతున్న అరుణ్ విజయ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-30 10:58:44  IST  )

కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్(Arun Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్టతల‘(RettaThala).

ఈ సినిమాలో మూడు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.. అంచనాలను పెంచుతున్న అరుణ్ విజయ్  కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్(Arun Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్టతల‘(RettaThala). ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను క్రిస్ తిరుకుమారన్ తెరకెక్కిస్తున్నారు. అరుణ్ విజయ్ కెరీర్‌లో 36వ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారు. బాబీ బాలచంద్రన్ సమర్పణలో బీటీజీ యూనివర్శల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాన్య రవిచంద్రన్(Tanya Ravichandran), సిద్ధి ఇద్నానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరుణ్ విజయ్ ‘రెట్టతల’పై అంచనాలను పెంచారు. ‘‘RettaThala సెన్సార్ పనులు త్వరలో పూర్తవుతాయి. ఇంకా కొన్ని CG పనులు మిగిలి ఉన్నాయి.

నేను నటించిన సినిమాల్లో, ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలో మూడు సర్‌ప్రైజులున్నాయి. టీజర్ ఇప్పుడే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. త్వరలోనే ట్రైలర్‌తో పాటు మరికొన్ని అప్డేట్స్ ఇస్తాము. నేను ‘రెట్టతల’ తర్వాత కొన్ని కథలు విన్నాను కానీ అవి నాకు నచ్చలేదు. ప్రజెంట్ ఫన్నీ సినిమాను చేయాలనుకుంటున్నాను. అలాంటి కథలు రెండు విన్నాను. ఇది చాలా ఉత్సాహంగా ఉంది. అవి సెట్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ కామెంట్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.

Next Story