- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవితంలో చాలా త్యాగాలున్నాయి.. విడాకులపై సందీప్ మాస్టర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో చాలామంది విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో చాలామంది విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న కారణాలతో మనస్పర్థలు వస్తున్నాయని పిల్లలు పుట్టినప్పటికీ పార్ట్‌నర్‌కు దూరం అవుతున్నారు. మరికొందరైతే ప్రేమలు పెళ్లి చేసుకున్నప్పటికీ కొద్ది కాలానికే విడిపోతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, డ్యాన్స్ మాస్టర్ సందీప్(Sandeep) భార్య జ్యోతి రాజ్ (Jyothiraj)ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. ‘‘మా ఇద్దరిని చూడగానే ఎంత మంచి జంట అనుకుంటారు. ఎప్పుడూ పక్కపక్కనే ఉంటారు. కానీ నేను ఆయన పక్కన డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడాలి. చాలామంది చూసి మంచి మొగుడు దొరికాడని అంటుంటారు. కానీ మొగుడు మంచోడు అయ్యేది ఎప్పుడంటే మనం తగ్గినప్పుడే. ఆ మంచి వెనుక చాలా త్యాగాలు ఉంటాయి. మన కోసం వాళ్ళు తగ్గుతుంటారు.. వాళ్ల కోసం మనం తగ్గాలి.
పెళ్లికి ముందు ఏదైనా కానీయండి. కానీ పెళ్లి ఫిక్స్ అయ్యింది అంటే దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు.. అతనిదే. అతనికి ఇచ్చేయాలంతే. వాళ్లే మన ప్రపంచం అనుకోవాలి. ఆయన ఒక్కసారి నో అంటే అది నో అంతే. నీ డ్రెస్ బాలేదు అని నోటితో చెప్పకపోయినా కూడా.. కంటి చూపుకి ఒక భాష ఉంటుంది. అలా చూస్తే.. హో మా ఆయనకి ఇది నచ్చలేదు అని. వెంటనే ఛేంజ్ చేసేయాలంతే. ఇష్టం చూపించడం అంటే అంతే అలాగే ఉంటుంది. ఆయనకు నచ్చలేదు అంటే నచ్చలేదు అంతే. జీవితంలో చాలా త్యాగాలు చేయాలి. బయటకు వెళ్లినప్పుడు కూడా మొగుడికి భయపడాలి. మంచోడు అనుకుంటారు.. దాని వెనుక ఎన్నో అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి.
ప్రియమైన భవిష్యత్ తరాల యువ జంటలు.. విడాకులతో నా సొంత అనుభవం నుండి, నేను ఒక సానుకూల సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. విడిపోవడం ఎల్లప్పుడూ ఏకైక పరిష్కారం కాదు. కొన్నిసార్లు, ప్రశాంతంగా ఉండటానికి, అర్థం చేసుకోవడానికి మీ భర్త మీ నుండి ఏమి కోరుకుంటున్నారో గౌరవించడానికి కొంత సమయం కేటాయించండి. సంబంధాలకు ఓర్పు, సానుభూతి, కమ్యూనికేషన్ అవసరం. మనం ఎదుర్కొనే దాని ద్వారా ఎదగడానికి ప్రయత్నిద్దాం’’ చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు సూపర్‌గా చెప్పావని అంటుంటే.. మరికొందరు మాత్రం నీ చావు నువ్వు చావు అని కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ ‘‘నువ్వు బాధపడుతూ మాస్టారును తిట్టినట్టు ఉంది’’ అని అన్నాడు.






