ఆ సంస్థకు కళ్లు చెదిరే ఆఫర్.. భారీ ధరకు అమ్ముడుపోయిన ‘దృశ్యం-3’ థియేట్రికల్ రైట్స్

by Mallepaka Hamsa |

‘దృశ్యం’ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. డైరెక్టర్ జీతూ జోసెఫ్(Jeetu Joseph), మోహన్ లాల్(Mohanlal) కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

ఆ సంస్థకు కళ్లు చెదిరే ఆఫర్.. భారీ ధరకు అమ్ముడుపోయిన ‘దృశ్యం-3’ థియేట్రికల్ రైట్స్
X

దిశ, సినిమా: ‘దృశ్యం’ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. డైరెక్టర్ జీతూ జోసెఫ్(Jeetu Joseph), మోహన్ లాల్(Mohanlal) కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీనికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2(Drushyam-3) కూడా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు సినిమాలు హిట్‌గా నిలవడంతో మూవీ మేకర్స్ ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డారు. ‘దృశ్యం-3’తో ప్రేక్షకులకు మరువలేని అనుభవాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు.

ఈ సినిమా ప్రకటనతోనే భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఇతర భాషలలో మాత్రం ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాలేదు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న దృశ్యం-3 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ మూవీస్ నిర్మిస్తుండగా.. పనోరమా స్టూడియోస్‌ విక్రయించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

ఈ డీల్ విలువ రూ. 160 కోట్లు అని టాక్. పనోరమా ఇప్పటికీ హిందీ సినిమాలను కోలుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మలయాళ చిత్రాన్ని అన్ని కోట్లు పెట్టి విక్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయనుండగా.. ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అలాగే తెలుగులో కూడా రాబోతుండగా.. వెంకటేష్ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ సీక్వెల్‌పై మాత్రం ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో సినీ ప్రియులు నిరాశ చెందుతున్నారు. ‘దృశ్యం-3’ ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి వస్తే హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

Next Story