- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతనితో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్(Fatima Sana Sheikh) ‘దంగల్’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్(Fatima Sana Sheikh) ‘దంగల్’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చింది. ఇందులో తన నటనతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. ఆ తర్వాత అనతి కాలంలోనే హీరోయిన్‌గా మారిన ఫాతిమా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఇక ఇటీవల ఈ అమ్మడు ‘ఆప్ జైసా కోయి’(Aap Jaisa Koi చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఆర్ మాధవన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకులను మెప్పిస్తూ టాప్ 1గా నిలిచింది. ఈక్రమంలో.. తాజాగా, ఫాతిమా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
‘‘మా రోజువారీ సెల్ఫీల నుండి ప్రారంభం అవుతుంది. మీతో పనిచేయడం ఒక ప్రయాణం లాంటిది. ఇందులోని ప్రతి పాట, ప్రతి సన్నివేశం మీకు ఎలా గుర్తుందో నాకు అర్థం కావడం లేదు. మీలో ప్రశాంతత ఉంది. మధును సృష్టించినందుకు.. నన్ను నమ్మి ఆ పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ సినిమాటిక్ ,మాయా ప్రపంచంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’’ అని రాసుకొచ్చింది. అలాగే వివేక్‌తో తీసున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు మూవీ బాగుందని కామెంట్లు పెడుతున్నారు.






