- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో శార్వరి వాఘ్ ఫిక్స్..!
బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే (Ahan Pandey)‘సైయారా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

దిశ, సినిమా: బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే (Ahan Pandey)‘సైయారా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనీత్ పడ్డా హీరోయిన్‌గా నటించింది. ఈ లవ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు సంచలనం సృష్టించింది. ఒక్క సినిమాతో అహాన్ పాండే క్రేజ్ మారిపోయింది. ప్రస్తుతం ఆయన మరో యాక్షన్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంతో రాబోతున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించబోతున్నారు. బాలీవుడ్ అతిపెద్ద హిట్ మేకర్లలో ఒకరైన అలీ అబ్బాస్ జాఫర్ (Abbas Jafar)దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో యంగ్ బ్యూటీ శార్వరి వాఘ్, అహాన్ పాండేతో రొమాన్స్ చేయనున్నట్లు టాక్. ఆమెను చిత్రబృందం సంప్రదించగా.. నటించేందుకు ఒప్పుకుంది. అంతేకాకుండా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.






