కిచ్చా సుదీప్ ‘మార్క్’ సినిమాలో బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ బ్యూటీ..

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) ఓ వైపు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో హోస్ట్‌గా వ్యవహరిస్తూనే వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయారు.

కిచ్చా సుదీప్ ‘మార్క్’ సినిమాలో బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ బ్యూటీ..
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) ఓ వైపు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో హోస్ట్‌గా వ్యవహరిస్తూనే వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ప్రేక్షకుల ఆనందానికి కారణమవుతున్నారు. ప్రస్తుతం సుదీప్ నటిస్తున్న చిత్రాల్లో ‘మార్క్’ (Mark)ఒకటి. ఆయన కెరీర్‌లో 47వ సినిమాగా రాబోతుండగా.. విజయ్ కార్తికేయ (Vijay Karthikeya)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలిమ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై సెంథిల్, త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.

భారీ యాక్షన్ డ్రామా కథతో రాబోతుండగా.. అజయ్ మార్కండేయ అనే పవర్ ఫుల్ పాత్రలో కిచ్చా సుదీప్ కనిపించబోతున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా.. ఇందులోనిష్వికా నాయుడు మరియు రోష్ని ప్రకాష్, దీప్శిఖా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ అర్చనా కొట్టిగే నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పలు సీన్లు కూడా పూర్తి చేసింది.

ప్రజెంట్ ‘మార్క్’ షూటింగ్ పాండిచేర్రీలో జరుగుతున్నట్లు టాక్. కంటెంట్-ఆధారిత సినిమాల్లో తన బలమైన నటనకు పేరుగాంచిన అర్చన, హోండిసి బరేయిరి, హాస్టల్ హుడుగారు బెకగిద్దరే, జుగల్బంది మరియు ఫారెస్ట్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు కిచ్చా సుదీప్‌తో మొదటిసారి నటించనుంది. ఆమె ఎలాంటి పాత్రలో కనిపించబోతుందో తెలియనప్పటికీ.. ప్రస్తుతం అర్చనాకు సంబంధించిన పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

Next Story