Dhanush: ‘ఇడ్లీ కడై’ సినిమాలో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ.. ఆ లక్కీ చాన్స్ కొట్టేసింది ఎవరంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-16 06:35:59  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

Dhanush: ‘ఇడ్లీ కడై’ సినిమాలో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ.. ఆ లక్కీ చాన్స్ కొట్టేసింది ఎవరంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘కుబేర’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇడ్లీ కడై’(Idli Kadai) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ధనుష్ స్వయం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిల్మ్స్, రెడ్ జాయింట్ పిక్చర్స్ బ్యానర్స్‌పై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇందులో అరుణ్ విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ధనుష్ ఒక క్యాటరర్, బాక్సింగ్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ఇడ్లీ కడై’ మూవీ అక్టోబర్ 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇడ్లీ కడై’ చిత్రంలో యంగ్ బ్యూటీ శాలిని పాండే(Shalini Pandey) కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఆమె ఇందులో ధనుష్ చెల్లి పాత్రలో అరున్ విజయ్‌ సరసన నటిస్తున్నట్లు పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.ఇక అది చూసిన నెటిజన్లు మూవీ బ్లాక్ హిట్ ఖాయం అని అభిప్రాయపడుతున్నారు. శాలిని పాండే తెలుగులో నటించిన అర్జున్ రెడ్డి బాక్సాఫీసును షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ‘ఇడ్లీ కడై’ అదే రేంజ్‌లో విజయం సాధించనుందని అంతా అంటున్నారు.

Next Story