- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పని చేయడం కష్టంగా అనిపించింది.. అలసిపోయాను అందుకే అలా చేయాల్సి వచ్చింది: విక్రాంత్ మాస్సే
టెలివిజన్ రంగం నుంచి వెండితెరకు వచ్చి ‘12th ఫెయిల్’ (12th Fail)మూవీతో స్టార్‌డమ్ అందుకున్న నటుడు విక్రాంత్ మాస్సే(Vikrant Massey).

దిశ, సినిమా: టెలివిజన్ రంగం నుంచి వెండితెరకు వచ్చి ‘12th ఫెయిల్’ (12th Fail)మూవీతో స్టార్‌డమ్ అందుకున్న నటుడు విక్రాంత్ మాస్సే(Vikrant Massey). గతేడాది చివర్లో ఆయన చేసిన 'రిటైర్మెంట్' ప్రకటన చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారమే రేపింది. కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉన్నప్పుడే సినిమాలకు స్వస్తి పలకడంపై ఫ్యాన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రాంత్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన పోస్ట్‌ను నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని విక్రాంత్ వెల్లడించారు. తన సినీ ప్రస్థానం ముగిసిపోలేదని, ఆ ప్రకటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరని ఆయన వివరించారు.
‘‘నిరంతర షూటింగ్‌ల వల్ల నేను శారీరకంగా, మానసిక అలసటకు గురయ్యాను. ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ, ప్రతిరోజూ 14 గంటలకు పైగా పని చేయడం వల్ల వ్యక్తిగత జీవితానికి సమయం దొరకలేదు. నా కుటుంబానికి, ముఖ్యంగా నా కొడుక్కి దూరం అవుతున్నాననే ఆవేదన కలిగింది. అందుకే నటనకు కొంతకాలం విరామం ఇచ్చి రీఛార్జ్ అవ్వాలని భావించాను. అంతే తప్ప శాశ్వతంగా రిటైర్ అవుతున్నానని నేను అనలేదు’’ అని క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడు నెలల విరామం తనకు ఎంతో అవసరమని, ప్రస్తుతం సరికొత్త ఉత్సాహంతో మళ్ళీ కథలు వింటున్నానని చెప్పారు. త్వరలోనే ఆయన పవర్‌ఫుల్ ప్రాజెక్టులతో కెమెరా ముందుకు రాబోతున్నారు.






