అందరూ చూస్తుండగానే స్టేజ్‌పై ఆ మహిళ అసభ్యకరంగా తాకింది: Dulquer Salmaan

by Disha Web Desk 9 |
అందరూ చూస్తుండగానే స్టేజ్‌పై ఆ మహిళ అసభ్యకరంగా తాకింది: Dulquer Salmaan
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళం హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. ‘మహానటి, సీతారామం’’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు. తాజాగా ఈ హీరో ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు వెల్లడించారు. ‘సీతారామం తర్వాత నాకు కేరళలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువయ్యింది. కామన్‌గా నాకు అబ్బాయిల ఫాలోయింగ్ చాలా ఉంటుంది. తరచూ వాళ్లతో టచ్‌లో ఉంటాను.

కాకపోతే కొన్ని సార్లు అభిమానులతో ఇబ్బంది పడ్డాను. ఇటీవల ఓ మహిళా అభిమాని నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. స్టేజ్‌పై ఉన్నప్పుడు నాతో ఫొటో దిగుతానని వచ్చి.. నా చెంప మీద ముద్దు పెట్టాలని చూశారు. అంతేకాదు గతంలో ఓ స్టేజ్‌పై అందరూ చూస్తుండగానే ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది. అంత మందిలో ఆమె అలా చేయడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేశాలు నాకు అస్సలు నచ్చవు.’’ అంటూ దల్కర్ సల్మాన్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

పెద్ద సినిమాల రీ-రిలీజ్‍ల‌పై.. Big Boss Sohel కీలక వ్యాఖ్యలు

Prabhas జాతకంలో దోషం.. పెళ్లి చేసుకుంటే జరిగేది ఇదే: Venu Swamy కామెంట్స్ వైరల్



Next Story

Most Viewed