- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరీక్షణ ముగిసింది.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల
మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. రవితేజ సరసన డింపుల్ హయాతీ, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంతో అంతా ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌పై రకరకాల పుకార్లు వినిపించాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న జీ5, మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
అంటే థియేటర్లలో విడుదలైన సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతోందన్నమాట. ‘‘మీ నిరీక్షణ ముగిసింది.. మాస్ మహారాజా వచ్చేస్తున్నాడు’’ అంటూ జీ5 సంస్థ ఒక చిన్న ట్రైలర్ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. రవితేజ మార్క్ టైమింగ్, కామెడీ సీన్స్‌తో కూడిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్, ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. రవితేజ ఎనర్జీ, కిషోర్ తిరుమల మార్క్ డైలాగ్స్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. మార్చి 13న స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సమ్మర్ సీజన్ ప్రారంభంలో ఇంటిల్లిపాదీ కలిసి చూసేందుకు ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.






