నిరీక్షణ ముగిసింది.. కొత్త సినిమా అప్డేట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన అషికా రంగనాథ్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్(Ashika Ranganath) పలు చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

నిరీక్షణ ముగిసింది.. కొత్త సినిమా అప్డేట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన అషికా రంగనాథ్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్(Ashika Ranganath) పలు చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తెలుగులో ఈ అమ్మడు ‘నా సామిరంగ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ కన్నడ భాషల్లో భారీ ప్రాజెక్ట్స్‌లో ఆఫర్ అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. త్వరలో అషికా రంగనాథ్ కన్నడ భాషా చిత్రం ‘గాథా వైభవ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇది తెలుగులో ‘గత వైభవ’ (Gathavaibava)పేరుతో రాబోతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీకి సింపుల్ సుని దర్శకత్వం వహిస్తుననారు. ఈ సినిమాలో దుష్యంత్‌(Dushyanth)తో అషికా రంగనాథ్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రాన్ని సుని సినిమాస్ బ్యానర్‌పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నవంబర్ 21న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అంచనాలను పెంచాయి. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈనేపథ్యంలో.. తాజాగా, ట్విట్టర్ ద్వారా అషికా రంగనాథ్ ‘గత వైభవ’ అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించింది. ‘‘నిరీక్షణ ముగిసింది. ‘గత వైభవ’ టీజర్ సెప్టెంబర్ 25న 11:11 గంటలకు రాబోతుంది’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో నీటిలో ఓ వ్యక్తి దున్నపోతును పట్టుకుని పరుగెడుతుండగా.. పక్కనే ఓ పోర్చుగల్‌లో, క్రిస్టోఫర్ కొలంబస్ నౌక, పొగమంచు కలిసి అందంగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

link

Next Story