- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు ఫ్లాప్ అని ఇప్పుడు సౌత్ సినిమాల కోసం క్యూ కడుతున్నారు.. బాలీవుడ్ హీరోయిన్లపై సమీరా సంచలన వ్యాఖ్యలు
నా టీమ్ వద్దు అని చెప్పినా నేను వినలేదు. ఎందుకంటే నేను చిరంజీవి, ఎన్టీఆర్, సూర్య, అజిత్, మోహన్ లాల్ వంటి దిగ్గజాలతో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా..

దిశ, సినిమా: టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సమీరా రెడ్డి తన కెరీర్ మొదట్లో తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి తాజాగా నోరు విప్పారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘నరసింహుడు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అప్పట్లో దక్షిణాది ఇండస్ట్రీ గురించి ఉత్తరాదిలో ఉన్న తప్పుడు అభిప్రాయాలను వెల్లడించారు. సమీరా రెడ్డి తన కెరీర్ ప్రారంభంలో హిందీ సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు సౌత్ సినిమాల ఆఫర్లు వచ్చాయట. కానీ ఆమె టీమ్ మాత్రం "హిందీలో అవకాశాలు లేని ఫ్లాప్ హీరోయిన్లు మాత్రమే సౌత్ సినిమాల వైపు వెళ్తారు" అని భయపెట్టారట. కానీ సమీరా మాత్రం ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపింది. ఒక సౌత్ ఇండియన్ అమ్మాయిగా మన ఇండస్ట్రీ పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చాటుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లినట్లు చెప్పింది.
"నా టీమ్ వద్దు అని చెప్పినా నేను వినలేదు. ఎందుకంటే నేను చిరంజీవి, ఎన్టీఆర్, సూర్య, అజిత్, మోహన్ లాల్ వంటి దిగ్గజాలతో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.. మా నాన్నకు కూడా ఎంతో గర్వకారణం. నా కుటుంబం గర్వపడటమే నాకు ముఖ్యం. ఇప్పుడు చూస్తే పరిస్థితి మారిపోయింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లందరూ సౌత్ సినిమాల కోసం క్యూ కడుతున్నారు. నిజానికి సౌత్ ఇండస్ట్రీ ఎప్పుడూ టెక్నాలజీ, యాక్షన్ పరంగా ఎంతో ముందుంది" అని సమీరా గర్వంగా చెప్పుకొచ్చారు. దక్షిణాది చిత్రాల ప్రయాణం గురించి మాట్లాడుతూ.. సౌత్ దర్శకులు కొత్త ప్రయోగాలు చేయడానికి రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ వెనకాడరని, కానీ హిందీ మేకర్స్ మాత్రం కాస్త సేఫ్ జోన్‌లో ఉండటానికే మొగ్గు చూపుతారని సమీరా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత సమీరా రెడ్డి మళ్లీ మేకప్ వేసుకున్నారు. సంజయ్ దత్ నటిస్తున్న ‘ఆఖరి సవాల్’ చిత్రంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఇది తన కమ్ బ్యాక్ కాదని, సినిమాల నుండి కేవలం ఒక చిన్న విరామం మాత్రమే తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. ఏది ఏమైనా సమీరా మళ్ళీ స్క్రీన్ పై కనిపించనుండటం విశేషం.






