వెంకటేష్ సినిమాలో డిజాస్టర్ బ్యూటీ.. అనిల్ రావిపూడి డేంజర్‌లో పడబోతున్నారా?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో 'సెన్సేషనల్ డైరెక్టర్'గా ఎదిగిన అనిల్ రావిపూడి(Anil Ravipudi), తన తదుపరి సినిమాని 2027 సంక్రాంతికి తీసుకురాబోతున్నారు.

వెంకటేష్ సినిమాలో డిజాస్టర్ బ్యూటీ..  అనిల్ రావిపూడి డేంజర్‌లో పడబోతున్నారా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో 'సెన్సేషనల్ డైరెక్టర్'గా ఎదిగిన అనిల్ రావిపూడి(Anil Ravipudi), తన తదుపరి సినిమాని 2027 సంక్రాంతికి తీసుకురాబోతున్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఏకంగా ₹360 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీని షేక్ చేయడంతో, ఆయన తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మూవీ టైటిల్ వినగానే అందరూ ముక్కున వేలేసుకుంటారని, ఒక విచిత్రమైన జర్నీని వెండితెరపై చూపించబోతున్నానని అనిల్ స్వయంగా ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అనిల్ రావిపూడి తన లక్కీ హీరో విక్టరీ వెంకటేష్‌(Venkatesh)తో ఐదోసారి పని చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు సంక్రాంతి బరిలో కాసుల వర్షం కురిపించాయి.

ఈ సారి కూడా అదే సెంటిమెంట్‌తో, పూర్తిస్థాయి వినోదాత్మక కథతో సెట్స్‌పైకి వెళ్లడానికి స్క్రిప్ట్ పనులను వేగవంతం చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఒక డిఫరెంట్ మేనరిజంతో కూడిన పాత్రను డిజైన్ చేసినట్లు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పూజా హెగ్డేని ఎంపిక చేసే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నారనే వార్త నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. గతంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు వరుసగా నిరాశపరచడంతో, ఆమెను ఐరన్ లెగ్ అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. అనిల్ రావిపూడి వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పూజాతో రిస్క్ చేయడం అవసరమా డేంజర్‌లో పడతారంటూ కొందరు అభిప్రాయపడుతుంటే, అనిల్ మార్క్ మేజిక్ ముందు ఎలాంటి బ్యాడ్ సెంటిమెంట్ పనిచేయదని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story