దెయ్యాలు, ప్రేతాత్మాలతో భయంకరంగా ‘కిష్కింధపురి’ ట్రైలర్.. ఈ లుక్‌లో అనుపమను చూస్తే వణికిపోవాల్సిందే!

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-22 15:04:19  IST  )

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కిష్కింధపురి’(Kishkindhapuri).

దెయ్యాలు, ప్రేతాత్మాలతో భయంకరంగా ‘కిష్కింధపురి’ ట్రైలర్.. ఈ లుక్‌లో అనుపమను చూస్తే వణికిపోవాల్సిందే!
X

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కిష్కింధపురి’(Kishkindhapuri). ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు మూవీ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘కిష్కింధపురి’ వాయిదా పడుతున్నట్లు పలు వార్తలు వచ్చాయి. దీంతో రిలీజ్‌పై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 12న రాబోతున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో..

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసి అందరినీ భయబ్రాంతులకు గురి చేశారు. ‘‘ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన.. పశ్చిమ దిక్కు ప్రేయతాత్మలన్నీ తూర్పుకు తిరిగాయి అని పవర్ ఫుల్ డైగాల్స్‌తో స్టార్ట్ అవుతుంది. దీంతో ఓ బూత్ బంగ్లాకు హీరో, హీరోయిన్‌తో పాటు మరికొందరు అందులోకి వెళ్తారు. దీంతో అక్కడున్న దెయ్యాలు, ప్రేయతాత్మలు సువర్ణమాయకు వచ్చేసిన వారికి వెల్‌కమ్ చెప్పి భయపెడతాయి. అక్కడున్న అద్దాలు పగిలిపోగా.. మొత్తం చిందరవందరగా అవుతుంది.

ఆ తర్వాత బతుకు మీదున్న తీపున్న వారు.. బ్రతకడానికి అర్హులే కారు అంటుండగా.. అడవిలోకి ఆత్మలు వెళుతున్నట్లు చూపించారు. అసలు ఏం జరిగిందో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగానే.. అనుపమకి ఏదో జరుగుతుంది. దీంతో హాస్పిటల్‌లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటుండగా.. ఆమెలోకి దెయ్యం ప్రవేశిస్తుంది. శరీరమంతా కట్లతో ఉండగా.. ఒక్కసారిగా బెడ్‌తో పాటు పైకి లేస్తోంది. కళ్లు మారిపోయి భయంకరమైన లుక్‌తో సృహలోకి వస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరినీ భయపెడుతూ అంచనాలను పెంచుతోంది.

Next Story