అలాంటి అప్డేట్‌తో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ‘టాక్సిక్’ టీమ్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

‘టాక్సిక్’ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ఆడియో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

అలాంటి అప్డేట్‌తో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ‘టాక్సిక్’ టీమ్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: కన్నడ సూపర్ స్టార్ యష్ (yash)హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ (Toxic). మొదటి నుంచి ఈ సినిమా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ పెద్ద దుమారమే రేపగా, ఒకానొక దశలో ఓ నటి తన సోషల్ మీడియా ఖాతాను కూడా డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ గొడవలు సర్దుమణిగాక, చిత్ర యూనిట్ వరుస అప్‌డేట్స్‌తో ముందుకొస్తోంది. తాజాగా ‘టాక్సిక్’ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ఆడియో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. గత రెండు రోజులుగా యష్ , కియారా అద్వానీల మధ్య ఉన్న రొమాంటిక్ పోస్టర్లను విడుదల చేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసింది.

దీంతో మేకర్స్ ఏదైనా బోల్డ్ వీడియో సాంగ్‌ను షేర్ చేస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, అనూహ్యంగా కేవలం ఆడియోను మాత్రమే విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో అది తెలుసుకున్న నెటిజన్లు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలా చేస్తారని అనుకోలేదంటూ ఫైర్ అవుతున్నారు. కాగా.. ఇందులో యష్‌తో పాటు బాలీవుడ్ భామ కియారా అద్వానీ, లేడీ సూపర్ స్టార్ నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక విలువల మధ్య గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


Next Story