నాన్-స్టాప్ వినోదానికి సమయం ఆసన్నమైంది.. ‘అనగనగా ఒక రాజు’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ‘ఓజీ’(OG).

నాన్-స్టాప్ వినోదానికి సమయం ఆసన్నమైంది.. ‘అనగనగా ఒక రాజు’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ‘ఓజీ’(OG). ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్‌లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం అభిమానులే కాకుండా.. సినీ సెలబ్రిటీలు సైతం వెయిట్ చేస్తున్నారనడంతో అతిశయోక్తి లేదు. ఓజీ విడుదల నేపథ్యంలో మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోలకు సంబంధించిన సినిమా అప్డేట్స్‌ను ‘ఓజీ’ థియేటర్స్‌లో అటాచ్ చేస్తున్నారు. తాజాగా, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) కూడా అదే ట్రిక్ ఫాలో అవుతున్నాడు. తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రోమోను ‘ఓజీ’ థియేటర్స్‌లో అటాచ్ చేశారు. యాడ్స్‌కు బదులు ‘అనగనగా ఒకరాజు’ అప్డేట్ ఇచ్చి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనున్నారు.

ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘అనగనగా ఒక రాజు కొత్త ఫన్-ప్యాక్డ్ ప్రోమో ప్రపంచవ్యాప్తంగా #TheyCallHimOG తో పాటు థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతోంది! నాన్-స్టాప్ వినోదం కోసం సమయం ఆసన్నమైంది,. మీ సమీపంలోని థియేటర్లలో AOR నవ్వు, OG ని సెలబ్రేట్ చేసుకోండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. కాగా ‘అనగనగా ఒకరాజు’ నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబోలో రాబోతుంది. మారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి్స్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లోకి రాబోతుంది.

link

Next Story