కీర్తి కళ్యాణంకు ముహూర్తం ఫిక్స్.. పెళ్లి కూతురి గెటప్‌లో అదిరిపోయిన అనుపమ

by Mallepaka Hamsa |

అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘క్రేజీ కల్యాణం’ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

కీర్తి కళ్యాణంకు ముహూర్తం ఫిక్స్.. పెళ్లి కూతురి గెటప్‌లో అదిరిపోయిన అనుపమ
X

దిశ, సినిమా: అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి, నరేష్ వీకే, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’(Crazy Kalyanam ). ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘క్రేజీ కల్యాణం’ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పెళ్లి కూతురిగా సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న అనుపమ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆమె ఈ చిత్రంలో కీర్తి అనే క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించనుంది. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్‌మెంట్ సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ‘క్రేజీ కల్యాణం’ సినిమా చిత్రీకరణ జరిపారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలిసినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story