- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బలగం’ టీమ్‌కు అభినందనలు తెలిపిన ఫిలిం క్రిటిక్స్
by Vinod kumar |
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘బలగం’ సినిమా టీమ్‌కు ఘనంగా సన్మానం జరిగింది.

X
దిశ, సినిమా: ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘బలగం’ సినిమా టీమ్‌కు ఘనంగా సన్మానం జరిగింది. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా జనాదరణ పొందుతుందని తనకు బలమైన నమ్మకం ఉందన్నాడు. అలాగే మొదటగా ఓటీటీకి ఇద్దామనుకున్నప్పటికీ చిత్రాన్ని చివరగా థియేటర్లలోనే విడుదల చేశామన్నాడు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ అందరూ అద్భుతంగా నటించారని అభినందించాడు.
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు ఎల్దండి మాట్లాడుతూ.. ‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమౌతున్నందుకు ఆనందంగా ఉంది. మూవీ క్రిటిక్స్ సత్కారానికి నోచుకోవడం నిజంగా మా అదృష్టమే’ అన్నాడు.
Next Story






