- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అఖండ-2’ తాండవం మీ ఊహకు అందని విధంగా భారీగా ఉండబోతోంది.. అంచనాలు పెంచేసిన మేకర్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ఇటీవల ‘డాకు మహారాజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ఇటీవల ‘డాకు మహారాజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘అఖండ-2’(Akhanda-2) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. చైల్డ్ ఆర్టిస్డ్‌గా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న చిన్నది హర్షల్ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘అఖండ’ సీక్వెల్‌గా రాబోతుంది. హై-ఆక్టేన్ కథతో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజస్విని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కానీ విడుదల నోచుకోలేదు. పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈక్రమంలోనే మూవీ మేకర్స్ దసరా కానుకగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అయినప్పటికీ ప్రేక్షకుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వచ్చే నెల భారీ సినిమాలు ఉండటంతో విడుదల అవుతుందా? లేక మళ్లీ వాయిదా పడనుందా? అని అయోమయంలో పడిపోయారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘అఖండ-2’ అప్డేట్ ఇస్తూ రిలీజ్ తేదీపై క్లారిటీ ఇచ్చారు.
బాలకృష్ణ ‘అఖండ-2’ కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. అలాగే ఈ పోస్ట్‌కు ‘‘ఈ జంట 4X బ్లాక్‌బస్టర్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. తాండవం మీ ఊహకు అందనంత పెద్దదిగా ఉండబోతోంది. పోస్ట్-ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో జరుగుతోంది సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు అంతా సిద్ధం. బాక్సాఫీసే వద్ద ‘అఖండ-2’ తాండవం చూసేందుకు సిద్ధంగా ఉండండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






