ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ ‘లోకా: చాప్టర్1’.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 08:50:32  IST  )

మలయాళ యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) నటించిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్1’(Loka: Chapter 1).

ఎట్టకేలకు ఓటీటీలోకి  రాబోతున్న సూపర్ హిట్ ‘లోకా: చాప్టర్1’.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) నటించిన లేటెస్ట్ మూవీ ‘లోకా: చాప్టర్1’(Lokah: Chapter 1). తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీసును షేక్ చేసింది. ఏకంగా ఈ చిత్రం రూ. 300 కోట్లు వసూళ్లు సాధించింది. దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ మలయాళంలో ఆగస్టు 28వ రిలీజ్ అయి మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదలై 50 రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఓటీటీలోకి రాకపోవడంతో సినీ ప్రియులంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు.

గతంలోనే ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఈ పుకార్లపై దుల్కర్ సల్మాన్ స్పందించి చెక్ పెట్టారు. దీంతో అంతా నిరాశ చెందుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ప్రముఖ ఓటీటీ సంస్థ ‘లోక:చాప్టర్1’ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీనికి ప్రకటించనున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. కాగా.. ఈ చిత్రం దీపావళి కానుకగా.. స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన సినీ ప్రియులంతా.. ఫుల్ ఖుషీ అవుతున్నారు.

లింక్

READ MORE ....

అలాంటి సీన్స్ చేయడానికి చాలా భయపడ్డాను..బయటకు చెప్పడానికి కూడా సిగ్గుపడ్డాను: సోనమ్ బజ్వా

Next Story