అప‌ర్ణ బాల‌ముర‌ళికి చేదు అనుభ‌వం.. చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్

by Disha Web Desk 10 |
అప‌ర్ణ బాల‌ముర‌ళికి చేదు అనుభ‌వం.. చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్
X

దిశ, సినిమా: సూర్యకు జోడిగా 'ఆకాశ‌మే నీ హద్దురా' మూవీ‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అప‌ర్ణ బాల‌ముర‌ళి. ప్రస్తుతం ఈమె 'తాంకం' పేరు‌తో మ‌ల‌యాళంలో ఓ సినిమా చేస్తోంది. ప్రమోష‌న్స్‌లో భాగంగా ఈ చిత్రం యూనిట్ ఓ కాలేజీని సందర్శించింది. అయితే ఇక్కడామెకు చేదు అనుభవం ఎదురైంది. అదేమిటంటే.. కాలేజీలో అపర్ణ ఎంట్రీ ఇవ్వాగానే ఆమెను చూసేందుకు స్టూడెంట్స్ అందరూ అత్రుతగా ముందుకు వచ్చారు. అందులో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అప‌ర్ణ బాల‌ముర‌ళి భుజంపై చెయ్యి వేసేందుకు ట్రై చేశాడు. ముందుగా ఆమెకు ఫ్లవ‌ర్‌తో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్, త‌ర్వాత ఆమె భుజంపై చెయ్యి వేశాడు. అత‌డి ప్రవ‌ర్తన‌తో ఇబ్బందిగా ఫీలైన అపర్ణను గమనించిన మూవీ యూనిట్, కాలేజీ యాజమాన్యం స్టూడెంట్‌ను అడ్డుకున్నారు.

Also Read....

Ajay Devgan లేనప్పుడు kajol అతడితో లిప్ కిస్

Next Story

Most Viewed