ఆ సీన్‌కు భయపడి ఉప్పెన సినిమాను వదులుకున్న స్టార్ హీరో కూతురు!

by Disha Web Desk 8 |
ఆ సీన్‌కు భయపడి ఉప్పెన సినిమాను వదులుకున్న స్టార్ హీరో కూతురు!
X

దిశ, సినిమా : ఉప్పెన సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీ యూత్‌కు చాలా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాతోనే మెగా హీరో వైష్ణవ్, హీరోయిన్‌గా కృతిశెట్టి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ఇక ఈ మూవీతో కృతిశెట్టి కెరీర్ టర్న్ అయ్యిందనే చెప్పాలి. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన మూవీ తర్వాత కృతికి వరసగా ఆఫర్స్ రావడం మొదలైంది. ఇప్పటికీ ఈ అమ్మడు చేతిలో అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీగా ఉంది.

అయితే అలాంటి మంచి ఆఫర్ ఉప్పెన సినిమాను ఓ స్టార్ హీరోయిన్ వదులుకున్నదంట. ఇండస్ట్రీలో చాలా మంది మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ అలాంటిది అదృష్టం తలుపు తడితే ఈ బ్యూటీ మాత్రం దాన్ని వదులుకుదంట.

అయితే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన మూవీలో మొదటగా హీరోయిన్‌గా రాజశేఖర్ కూతరు, శివాని రాజశేఖర్ అనుకున్నారంట మూవీ మేకర్స్. దీంతో ఈ విషయాన్ని ఆమెకు చెప్పడంతో, ముద్దు సన్నివేశాల్లో నటించాల్సినందుకు తాను ఆ సినిమాను రిజక్ట్ చేసినట్లు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో అయ్యో మంచి అవకాశం మిస్ చేసుకుంది శివాని రాజశేఖర్ అంటున్నారు నెటిజన్స్.



Next Story

Most Viewed