లిప్ లాక్ సీన్‌లో బోల్డ్‌గా రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

by Disha Web Desk 9 |
లిప్ లాక్ సీన్‌లో బోల్డ్‌గా రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ అవార్డు విజేత బ్లేస్సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ది గోట్ లైఫ్’’. ఈ చిత్రంలో పాత్ర కోసం ప్రాణం పెట్టే నటుడు పృథ్వీరాజ్ సరసన హాట్ బ్యూటీ అమలాపాల్ కథానాయికగా నటిస్తోంది. ఎడారిలో వలస జీవుల ఆకలి వేదన, బానిస బతుకు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారు. సుకుమారన్ ఎడారిలో పనిచేసే ఒక కూలీగా నటిస్తాడు. ఈ పాత్ర కోసం ఈ హీరో ఎంతలా శ్రమిస్తున్నారో, తన మేకోవర్ ఎలా మార్చుకున్నారో తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఎక్కువ భాగం ఈ చిత్ర షూటింగ్ ఎడారిలోనే సాగుతోంది.

వలస కార్మికులు ఆహారం, నీళ్లు దొరకక పడే వేదనని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఈ సినిమా కోసం గత పదేళ్లుగా శ్రమిస్తున్నారట. అయితే ఇటీవల అమలాపాల్ ఎక్కువగా బోల్డ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కూడా ఈ బ్యూటీ బోల్డ్ రొమాన్స్‌తో రెచ్చిపోయింది. ట్రైలర్‌లో అమలాపాల్, సుకుమారన్ మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఘాటుగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేయనున్నారు.

Next Story

Most Viewed