- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో.. అలాంటి యాడ్‌లో కనిపించడంతో అంతా షాక్..తేడానా అంటూ నెటిజన్ల కామెంట్స్ ! (వీడియో)
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) ట్రెండ్ సెట్ చేసిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. బంగారు ఆభరణాల యాడ్‌లో పాల్గొని వెరైటీగా ప్రవర్తించారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) ట్రెండ్ సెట్ చేసిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. బంగారు ఆభరణాల యాడ్‌లో పాల్గొని వెరైటీగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా బంగారు అభరణాలకు సంబంధించిన యాడ్స్‌లో హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఈ సారి మోహన్‌లాల్ ఆ యాడ్ చేశారు. ఇందులో ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండానే అందరినీ మెస్మరైజ్ చేశాడు. కేవలం అతని కళ్ళు, హావభావాలు మాత్రమే చూపించాడు. ఇక యాడ్ విషయానికొస్తే.. ఇందులో ఆయన బ్లాక్ కలర్ సూట్‌లో కనిపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత విన్స్‌మేరా అధినేత ప్రకాష్ వర్మ వెల్ చెప్పి లోపలికి తీసుకెళతాడు. ఆ తర్వాత ఓ మోడల్‌ను పరిచయం చేస్తాడు. ఈక్రమంలోనే ఆమె మెడలోంచి తీసిన నగలను బాక్స్‌లో పెడతారు.
ఆ తర్వాత చూస్తే అందులోని నగలు మాయం కావడంతో అక్కడున్న వారంతా షాక్ అవుతున్నారు. కానీ ఆ నగలను మోహన్‌లాల్ కొట్టేసి ఓ రూమ్‌లోకి అవన్నీ తన ఒంటిపై వేసుకుని అమ్మాయిలా ఫీల్ అవుతాడు. చేతులను అటు ఇటు అంటూ గాజులు, నెక్లెస్ చూసుకుంటాడు. అంతేకాకుండా చేతులతో ముఖాన్ని తాకుతూ అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోతాడు. ఈ క్రమంలోనే ప్రకాష్ వర్మ వచ్చి చూసి షాక్ అవుతాడు. ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడగ్గా ఆ నగలను దాచే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు గట్టిగా నవ్వుతారు అంతటితో యాడ్ కంప్లీట్ అవుతుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొందరు అభరణాల యాడ్స్ అమ్మాయిలే చేయాలా? అబ్బాయిలు కూడా చేయగలరని నిరూపించారు దటీజ్ మోహన్ లాల్ అంటుంటే మరికొందరు మాత్రం ఆ యాడ్ ఆయన చేసినదంతా సడెన్‌గా చూసి తేడానా ఏంటి అని అంటున్నారు. కాగా, మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఆయన నటించిన ‘తుడరుమ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మోహన్ లాల్ ‘హృదయ పూర్వం’(Hridaya Poorvam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆగస్టు 28న థియేటర్స్‌లోకి రాబోతుంది.






