ఆ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో అందరికీ భోజనాలు పెట్టిన స్టార్ హీరో.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్-2’(Sardar-2).

ఆ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో అందరికీ భోజనాలు పెట్టిన స్టార్  హీరో.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్-2’(Sardar-2). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. మిత్రన్(Mithran) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్ విడుదల మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా?అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘సర్దార్-2’ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం.

దీంతో చిత్రయూనిట్‌కు మూవీ మేకర్స్ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తి అందరికీ ప్రేమగా భోజనాలు వడ్డించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అది చూసిన నెటిజన్లు వావ్ గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, కార్తీ ‘సర్దార్-2’తో పాటు ‘ఖైదీ-2’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

link

Next Story