- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నగారి రాకకు రంగం సిద్ధం.. డిసెంబర్ బరిలో కార్తి సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి(karthi) సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తి(karthi) సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అలాంటి కార్తి తాజాగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘వా వాతియార్’. ఈ సినిమా తెలుగులో ‘అన్నగారు వస్తారు’(annagaaru vastaru) అనే టైటిల్‌తో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తోనే ఈ మూవీ మీద హైప్ పెరిగిపోవడంతో.. అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌ను గ్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నలన్ కుమారస్వామి(Nalan Kumaraswamy) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సరికొత్త నేపథ్యం, ఆకట్టుకునే హాస్యం, కార్తి ఎనర్జీ అన్నీ కలిసిపడి పూర్తి మాస్–ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్టు సమాచారం.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సీనియర్ నటుడు సత్యరాజ్, నేషనల్ అవార్డ్ విన్నర్ మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ వంటి పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ భారీ తారాగణం కారణంగా కూడా సినిమాపై మంచి బజ్ నెలకొంది. చాలా రోజుల క్రితమే షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ, రిలీజ్ గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కానీ గత కొన్ని రోజులుగా వరుసగా విడుదల చేస్తున్న పోస్టర్లు, క్యారెక్టర్ గ్లింప్స్, ప్రమోషనల్ వీడియోలు అభిమానుల్లో ఆసక్తిని మరింతగా పెంచాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా, చిత్రబృందం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ రిలీజ్ తేదీని ప్రకటించింది. ‘అన్నగారు వస్తారు’ చిత్రం డిసెంబర్ 12న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోందని మేకర్స తెలిపారు. ఈ అప్డేట్‌తో కార్తి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. కొత్త పోస్టర్‌లో కార్తి లుక్, సినిమాటిక్ స్టైల్ చాలా ఆకట్టుకునేలా ఉండడంతో ‘అన్నగారు వస్తారు’మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కార్తి నుండి మరో మాసివ్ ఎంటర్‌టైనర్ రాబోతోందన్న హింట్ ఇప్పటివరకూ విడుదలైన ప్రతి అప్డేట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. డిసెంబర్ 12న ‘అన్నగారు వస్తారు’ తో కార్తి మరో సూపర్ హిట్ అందించనున్నాడనే నమ్మకం అభిమానుల్లో గట్టిగా నెలకొంది. ఇక దీంతో పాటు డిసెంబర్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వాటితో పోటీ పడి కార్తి గెలుస్తాడో లేదో చూడాలి.






