- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధురంధర్-2’ చూసి సౌత్ ఇండస్ట్రీ ఎంతో నేర్చుకోవాలి.. దుమారం రేపుతున్న ఆర్జీవీ కామెంట్స్!
ఒకవేళ ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,500 - 2,000 కోట్ల వసూళ్లను సాధిస్తే, సౌత్ సినిమాలన్నీ తోక ముడవాల్సిందే.

దిశ, సినిమా: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన హాట్ కామెంట్స్‌తో ఇండస్ట్రీలో చర్చకు తెరలేపారు. రణవీర్ సింగ్ హీరోగా రాబోతున్న ‘ధురంధర్ 2: ద రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈ సినిమా గనుక భారీ వసూళ్లు సాధిస్తే, ప్రస్తుతం నడుస్తున్న సౌత్ సినిమాల హవాకు బ్రేక్ పడుతుందని వర్మ అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. "ఒకవేళ ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,500 - 2,000 కోట్ల వసూళ్లను సాధిస్తే, సౌత్ సినిమాలన్నీ తోక ముడవాల్సిందే. దాన్ని చూసి చాలా నేర్చుకోవాల్సిందే లేకుంటే వసూళ్లు కష్టతరం అవుతుంది" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ యాక్షన్ సినిమాలు ఇప్పటికీ పాత తరహా కథనాలతోనే సాగుతున్నాయని, కానీ 'ధురంధర్' సిరీస్ బాలీవుడ్ యాక్షన్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లిందని ఆయన కొనియాడారు.
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం రూ. 1,300 కోట్లు వసూలు చేయడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో రణవీర్ సింగ్ 'హంజా' (జస్కీరత్) అనే ఇండియన్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ.. "గాలిలో ఎగురుతూ తన్నే విన్యాసాలు కాకుండా, ఇందులో యాక్షన్ చాలా సహజంగా ఉంటుంది. కథలో ప్రేక్షకులు ఇప్పటికే ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉన్నారు. బాహుబలి తరహాలో రెండు భాగాలను ఒకేసారి షూట్ చేయడం వల్ల కథా ప్రవాహం చాలా బాగుంటుంది" అని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.
నిజానికి ఈ సినిమా యష్ నటిస్తున్న 'టాక్సిక్'తో తలపడాల్సి ఉంది. కానీ 'టాక్సిక్' జూన్‌కు వాయిదా పడటంతో ఆ ముప్పు తప్పింది. అయితే, ఇప్పుడు 'ధురంధర్ 2' నేరుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. మార్చి చివరి వారంలో ఈ రెండు భారీ సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రాబోతుండటంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ కాస్ట్ ఉండటం సినిమాపై మరింత క్రేజ్ పెంచుతోంది.






